Play all audios:
ఇంటర్నెట్‌డెస్క్: మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో రామ్ నటిస్తోన్న సినిమా (#RAPO22) పేరు ఖరారైంది. నేడు ఈ యంగ్ హీరో పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ను ప్రకటించారు. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra
King Taluka) అంటూ టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ‘బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. ఇందులో సాగర్‌గా రామ్ (Ram Pothineni) కనిపించనుండగా.. మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే
(Bhagyashri Borse) అలరించనున్నారు. * దాదాసాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్.. బయోపిక్‌లో నటించనున్న హీరో! ఇక ఈ సినిమాలో నటుడు ఉపేంద్ర కీలకపాత్రలో కనిపించనున్నారు. సినిమా కథలో ఉపేంద్ర హీరో కాగా..
ఆయన్ని అభిమానించే వ్యక్తిగా రామ్ ఇందులో కనిపించనున్నట్లు వీడియో ఆధారంగా అర్థమవుతోంది. రామ్ 22వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. హై ఎనర్జీతో న్యూ ఏజ్
స్టోరీగా ఇది రానుంది. మైత్రీ మూవీస్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు దీన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో ‘ఆంధ్ర కింగ్ తాలూకా.. టికెట్టు ఇవ్వాల్సిందే’ అనే డైలాగ్ సినిమాపై
అంచనాలు పెంచేలా ఉంది.