Thuglife: ఆ క్షణం నాన్నే నాతో మాట్లాడినట్టు అనిపించింది: శివరాజ్‌ కుమార్‌

Thuglife: ఆ క్షణం నాన్నే నాతో మాట్లాడినట్టు అనిపించింది: శివరాజ్‌ కుమార్‌

Play all audios:

Loading...

చెన్నైలో జరిగిన ‘థగ్‌ లైఫ్‌ ’ఆడియో లాంచ్‌కి ముఖ్య అతిథిగా కన్నడ యాక్టర్‌ శివ రాజ్‌కుమార్‌ హాజరయ్యారు. బెంగళూరులో కమల్‌ హాసన్‌ను కలిసిన తీపి జ్ఞాపకాలను ఈ సందర్భంగా ఆయన పంచుకున్నారు.


ఇంటర్నెట్‌ డెస్క్‌:   కమల్‌ హాసన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రం  ‘థగ్‌ లైఫ్’. తాజాగా  సాయి రామ్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ చెన్నై వేదికగా  ఆడియో లాంచ్‌ నిర్వహించారు. దీనికి ముఖ్య


అతిథిగా కన్నడ యాక్టర్  శివ రాజ్‌కుమార్‌ హాజరయ్యారు.  ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ   కమల్‌ సర్‌కి వీరాభిమానినని అన్నారు. ‘‘ఆయన నవ్వు, కళ్లు, వ్యక్తిత్వం అంటే నాకిష్టం. ఆయనలోని ప్రతి


విషయాన్ని నేను ఇష్టపడతాను.  ఆయన సినిమాలు మొదటి రోజు, మొదటి షోలోనే చూస్తాను’’అని అన్నారు. బెంగళూరులోని తన ఇంట్లో కమల్‌హాసన్‌ కలిసిన విషయాన్ని పంచుకున్నారు.  ‘‘నాకింకా గుర్తుంది . ఆయన మా


ఇంటికి వచ్చారు.   మా నాన్న డా. రాజ్‌కుమార్‌తో ఆయన మాట్లాడారు. నాన్న నన్ను ఆయనకి పరిచయం చేశారు. నేను ఒక హగ్‌ ఇవ్వమని అడిగాను. ఆ తర్వాత నేను మూడు రోజుల పాటు స్నానం చేయలేదు. ఆ హగ్‌ ఫీలింగ్‌


అలాగే ఉండాలని కోరుకున్నాను. ఆయన సినిమాల గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే నేను వారితో గొడవపడేవాడిని.  వారు చెడుగా చెప్పినా నేను మంచి గురించే ఆలోచిస్తాను’’అని శివ రాజ్‌కుమార్‌ అన్నారు. తాను


క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్న సమయంలో కమల్‌ హాసన్‌ ఫోన్‌ చేసి మాట్లాడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  ‘‘నాకింకా గుర్తుంది. నాకు  మియామిలో క్యాన్సర్‌ సర్జరీ అయ్యింది. ఆ


సమయంలో కమల్‌ సర్  చికాగోలో  ఉన్నారు.  సర్‌ నుంచి నాకు కాల్‌ వచ్చింది. ఆయనతో మాట్లాడటం చాలా సంతోషంగా అనిపించింది.  ‘నీకు తెలియదు కానీ శివన్నా.. నీతో మాట్లాడుతుంటే, నాకు కన్నీళ్లు ఆగడంలేదు


’అని కమల్‌ అన్నారు. ఆ క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోను. నాన్నే నాతో మాట్లాడినట్టు అనిపించింది’’. అని అన్నారు.  కమల్‌ హాసన్‌  సినిమాలోని ఐకానిక్‌ సాంగ్‌ ‘ఒరే నాల్‌ ఉన్నయ్‌ నాన్‌’ అనే పాటను


పాడి అలరించారు.