Play all audios:
తన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు మేనేజర్ విపిన్ ప్రయత్నిస్తున్నాడని మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ అన్నారు. విపిన్ ఫిర్యాదుపై ఆయన స్పందించారు. ఇంటర్నెట్ డెస్క్: తన మాజీ మేనేజర్ విపిన్ ఇచ్చిన
ఫిర్యాదుపై మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan) స్పందించారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. అతడిపై తానెలాంటి దాడి చేయలేదన్నారు. తన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు అలా చేస్తున్నాడని
పేర్కొన్నారు. కొన్నాళ్లుగా తనతో ప్రయాణించిన వ్యక్తి అలా ప్రవర్తించడం షాక్‌కు గురిచేసిందన్నారు. విపిన్ లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏం జరిగిందంటే..? * థియేటర్లలో ధరల
నియంత్రణకు చర్యలు.. బంద్ వెనుక శక్తులేమిటో విచారించాలి: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇటీవల విడుదలైన ‘నరివెట్ట’ (Narivetta) సినిమాలోని టొవినో థామస్ (Tovino Thomas) నటనను మెచ్చుకోవడంతో తనపై
ఉన్ని.. దుర్భాషలాడారని, ఫిజికల్‌గా దాడి చేశారంటూ విపిన్ పోలీసులను ఆశ్రయించారు. ‘‘టొవినో థామస్ ‘నరివెట్ట’ సినిమాకి నేను ప్రమోషన్స్ చేశా. ఆ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ పోస్టు పెట్టా. అది
ఉన్ని ముకుందన్‌కు నచ్చలేదు. అదే రోజు రాత్రి నన్ను పిలిచి.. ఇకపై తన వద్ద పనిచేయొద్దని చెప్పాడు. నేను సరే అన్నాను. మరుసటి రోజు తన ఇంటికి రావాలని చెబితే.. వెళ్లా. అసభ్యకరంగా మాట్లాడి, నన్ను
కొట్టాడు. దాదాపు ఆరేళ్లు అతడి వద్ద పనిచేశా. నేను వేరే నటులకూ పీఆర్.. అనే విషయం అతడికి తెలుసు. ‘మార్కో’ తర్వాత మంచి కథలు రావడంలేదన్న నిరాశలో ఉన్నాడు. ఓ సినిమాకి దర్శకత్వం వహించాలనుకున్నా అదీ
రద్దు అయింది. అందుకే ఫ్రస్ట్రేషన్‌ను పక్కన వారిపై చూపిస్తున్నాడు’’ అని విపిన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘యశోద’ తదితర
చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు.