Ipl 2025 playoffs: సండే ఐపీఎల్‌ ట్రిపుల్‌ ధమాకా.. రెండు మ్యాచులు.. మూడు బెర్త్‌లు

Ipl 2025 playoffs: సండే ఐపీఎల్‌ ట్రిపుల్‌ ధమాకా.. రెండు మ్యాచులు.. మూడు బెర్త్‌లు

Play all audios:

Loading...

IPL Playoffs Scenario : ఈ రోజు జరగబోయే రెండు ఐపీఎల్‌ మ్యాచులతో ఐపీఎల్‌ 2025 మూడు బెర్తుల్లో ఒకటి అధికారికంగా, రెండు దాదాపుగా ఖాయమవుతాయి.  ఇంటర్నెట్‌ డెస్క్: చిన్న గ్యాప్‌ తర్వాత ఐపీఎల్‌ 2025


(IPL) శనివారం ప్రారంభమైంది. అయితే తొలి మ్యాచ్‌ వర్షార్పణమైంది. దీంతో ఆదివారం నుంచి ఐపీఎల్‌ సందడి మొదలు కానుంది. సాధారణంగా ఆదివారం రెండు మ్యాచులతో డబుల్‌ ధమాకా ఉంటుంది. ఈ రోజు మాత్రం


ట్రిపుల్‌ ధమాకా అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు జరగబోయే రెండు మ్యాచులతో ప్లేఆఫ్స్‌లో ఒక బెర్తు అధికారికంగా, రెండు బెర్తులు దాదాపుగా ఖాయమైపోతాయి. * శనివారం జరగాల్సిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు


- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవ్వడంతో 17 పాయింట్లతో బెంగళూరు (Royal Challengers Bengaluru) పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరుకుంది. ప్లేఆఫ్స్‌కి దాదాపు చేరుకుంది. *


ఆదివారం 3.30కి మొదలయ్యే మ్యాచ్‌లో మాంచి దూకుడు మీదున్న పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings).. రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals)ని ఓడిస్తే టాప్‌ 2లోకి వచ్చి ప్లేఆఫ్స్‌కి మరింత చేరువవుతుంది.


* ఈ రోజు 7.30కి దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals)తో జరగబోయే మ్యాచ్‌లో గుజరాత్‌ టైటన్స్‌ (Gujarat Titans) గెలిస్తే 18 పాయింట్లతో అధికారికంగా ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంటుంది. * పై


రెండు అంశాలు జరిగితే గుజరాత్‌, పంజాబ్‌తో పాటు బెంగళూరు కూడా ప్లేఆఫ్స్‌కు చేరినట్లే. అప్పుడు నాలుగో బెర్త్ కోసం ముంబయి ఇండియన్స్‌ (14 పాయింట్లు), దిల్లీ (13), లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (10)


మధ్య పోటీ ఉంటుంది. * ఆదివారం రెండో మ్యాచ్‌లో గుజరాత్‌ ఓటమిపాలైతే దిల్లీ 15 పాయింట్లతో టాప్‌ 4లోకి వస్తుంది. దాంతో ముంబయి పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ ఓడిపోతే.. ఆ


జట్టుకు తర్వాత 2 మ్యాచ్‌లు కీలకంగా మారతాయి. * _గమనిక:_ ప్రస్తుత సమీకరణాల నేపథ్యంలో ప్లేఆఫ్స్‌ పరిస్థితి ఇది. వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దయితే పాయింట్ల పట్టికలో మార్పులొస్తాయి. దాంతో ఆయా జట్ల


ప్లేఆఫ్స్‌ అవకాశాలు తారుమారు అవ్వొచ్చు. (IPL Playoffs Scenario) ------------------------- పాయింట్ల పట్టిక - జట్లు ఆడాల్సిన మ్యాచ్‌లు __