Play all audios:
రాజమౌళిని రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఆటపట్టించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులోనే.. ‘ఆర్‌ఆర్‌ఆర్ 2’పై స్పందించారు రాజమౌళి. ఇంటర్నెట్ డెస్క్: హీరోలు రామ్‌చరణ్ (Ram Charan), ఎన్టీఆర్
(NTR), డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) ఎంతో స్నేహంగా ఉంటారనే సంగతి తెలిసిందే. వారి అనుబంధాన్ని చాటే ఎన్నో వీడియోలు ఇప్పటికే నెట్టింట సందడి చేయగా.. తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది. అందులో..
హీరోలిద్దరూ దర్శకుడిని ఆటపట్టిస్తూ కనిపించారు. ‘ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ 2’ (RRR 2) చేస్తారా? అని ఒకరు అడగ్గా ‘ఎస్’ అని రాజమౌళి సమాధానమిచ్చారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
‘ఆర్‌ఆర్‌ఆర్ లైవ్ కాన్సర్ట్’లో చోటుచేసుకున్న దృశ్యాలవి. ఆ ఈవెంట్ లండన్‌లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో కొన్ని రోజుల క్రితం జరిగింది. ఈ ముగ్గురితోపాటు సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి
తదితరులు హాజరయ్యారు. * వరుస సినిమాలు.. అరుదైన రికార్డులు: దటీజ్ మోహన్‌లాల్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సీక్వెల్‌పై ఇప్పటికే పలుమార్లు సానుకూలంగా స్పందించారు రాజమౌళి. మరోవైపు, ఆ మూవీ కథా రచయిత, రాజమౌళి
తండ్రి విజయేంద్రప్రసాద్ సైతం ‘ఆర్‌ఆర్‌ఆర్ 2’ తెరకెక్కే అవకాశాలున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘బాహుబలి 2’ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్’ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో లైవ్ కాన్సర్ట్ చేసిన తొలి
విదేశీ చిత్రంగా ‘బాహుబలి 2’ రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్’ నిలిచింది. రెండూ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలే కావడం విశేషం.