Trump accused china: ‘మంచితనానికి రోజుల్లేవ్‌’.. చైనాపై మరోసారి ట్రంప్‌ రుసరుస

Trump accused china: ‘మంచితనానికి రోజుల్లేవ్‌’.. చైనాపై మరోసారి ట్రంప్‌ రుసరుస

Play all audios:

Loading...

Trump accused china | వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald trump) చైనాపై మరోసారి విరుచుకుపడ్డారు. ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని డ్రాగన్‌ దేశం ఉల్లంఘించిందని


ఆరోపించారు. ‘అతి మంచితనం పనికి రాదు’ అంటూ తన సామాజిక మాధ్యమం ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ఇంతకీ ఏ విషయంలో చైనా ఒప్పందం ఉల్లంఘించిందనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. కొన్ని వారాల క్రితం


పోటాపోటీగా సుంకాల పోరుకు దిగిన ఇరు దేశాలూ.. తర్వాత వాణిజ్య చర్చల కోసం అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి చైనాపై ట్రంప్‌ రుసరుసలాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘రెండు


వారాల క్రితం చైనా ఆర్థికంగా ప్రమాదంలో ఉంది. నేను విధించిన సుంకాల కారణంగా అమెరికాతో వ్యాపారం దాదాపు అసాధ్యం అనే పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడి పరిస్థితులు దిగజారాయి. చాలా కర్మాగారాలు


మూతబడ్డాయి. ఓ రకంగా పౌర అశాంతి నెలకొంది. సర్లే అని అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు చైనాతో త్వరితగతిన ఒప్పందం కుదుర్చుకున్నా. ఈ ఒప్పందం కారణంగా అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి


చేరుకున్నాయి. చైనా యథావిధిగా తిరిగి వ్యాపారాన్ని ప్రారంభించింది. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ అప్పుడే చైనా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. మాతో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇది ఎవరికీ


పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. మంచిగా మెలిగినందుకు నాకు తగిన శాస్తే జరిగింది’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య పరిస్థితులు చక్కబడ్డాయనుకున్న వేళ ట్రంప్‌ నుంచి ఈ తరహా ప్రకటన రావడం


ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై చైనా అధికారికంగా ఇంకా స్పందించలేదు.