Ap new rules : ఏపీలో కొత్త రూల్స్.. అతిక్రమిస్తే కఠిన చర్యలు

Ap new rules : ఏపీలో కొత్త రూల్స్.. అతిక్రమిస్తే కఠిన చర్యలు

Play all audios:

Loading...

Published by: Last Updated:January 03, 2023 8:34 AM IST AP NEW RULES : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్స్ తెచ్చింది. ఇకపై ఎవరైనా వాటిని ఫాలో అవ్వాలని చెప్పింది. ఎవరైనా అతిక్రమిస్తే మాత్రం


చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. (REPORTER - RAGHU, NEWS18TELUGU) AP New Rules : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తోంది. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం


కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా సరే.. రోడ్లపై సభలు, ర్యాలీలూ ఇష్టమొచ్చినట్లు నిర్వహిస్తామంటే కుదరదు. రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రోడ్లు, మార్జిన్లకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. ఈ


నిర్ణయం కారణంగా.. ఇకపై రాజకీయ పార్టీలు, ఇతర వర్గాలూ.. రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించే అవకాశం లేదు. ఈ సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై ఇలాంటి ర్యాలీలూ, సభలూ జరిపేందుకు ప్రత్యామ్నాయ


ప్రదేశాలను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించింది. రోడ్లకు దూరంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశాలను ఎంపిక చేయాలని చెప్పింది. ఆ ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు, ర్యాలీలు


నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వనుంది. అలా కుదరదనీ... కచ్చితంగా రోడ్లపైనే ర్యాలీ లేదా సభకు అనుమతి ఇవ్వాలని ఎవరైనా పట్టుపడితే... అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే షరతులతో అనుమతి ఇవ్వాలని


ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే... నిర్వాహకులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. advertisement ఈ మధ్య కందుకూరు, గుంటూరులో జరిగిన రెండు దుర్ఘటనల్లో సామాన్య


ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర హోంశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ పార్టీలకు సమస్యే : ప్రజల భద్రత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నా... రాజకీయ పార్టీలకు మాత్రం ఇది సమస్యే


అంటున్నారు కొందరు. అటు జనసేన , ఇటు టీడీపీ .. ర్యాలీలకు సిద్ధమవుతున్న సమయంలో.. ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మరి దీనిపై ప్రతిపక్షాలు ఏం చేస్తాయన్నది చూడాలి. Location :


Hyderabad,Telangana First Published : January 03, 2023 8:34 AM IST Read More