Play all audios:
Reported by: Published by: Last Updated:May 05, 2023 9:20 AM IST ANDHRA PRADESH: మరణం మనం కోరుకోని ప్రయాణం, అటువంటి ప్రయాణంలో మనకు తోడుగా నిలిచే కొన్ని అందమైన అనుభూతులతో కొనసాగాలి. కానీమన
జీవితంలో మనం చేసే పనులకు గుణపాఠాలు ఎదురవుతూ ఉంటాయి. D.Prasad, News18, Kadapa మరణం మనం కోరుకోని ప్రయాణం, అటువంటి ప్రయాణంలో మనకు తోడుగా నిలిచే కొన్ని అందమైన అనుభూతులతో కొనసాగాలి. కానీమన
జీవితంలో మనం చేసే పనులకు గుణపాఠాలు ఎదురవుతూ ఉంటాయి. క్షణికావేషంలో మనం అప్పుడప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు మనల్ని ఎంతోకాలం బాధపడేలా చేస్తాయి అంతే కాదు మన కుటుంబాలనీ ఎంతో ప్రభావితం
చేస్తాయి. అలాంటి పరిస్థితిని కొనితెచ్చుకున్న ఒక వ్యక్తి తన చివరి క్షణాలలో తనకి ఇష్టమైన జీవితానికి దూరంగా, కారాగారంలో మృతి చెందిన సంఘటన కడప జిల్లా కేంద్ర కారాగారంలో చోటు చేసుకుంది.
advertisement వివరాల్లోకి వెళితే. కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదీగా వున్నతెలుగు రామాంజనేయులు (58) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంతకాలం ఇతను హత్యా నేరం కేసులో కడప కేంద్ర కారాగారంలో
జీవితఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. మృతుడు రామాంజనేయులు స్వస్థలం నంద్యాల జిల్లా వెలుగోడు ప్రాంతం. తను చేసిన హత్య నేరానికి శిక్ష అనుభవిస్తూ ఏప్రిల్ 17న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో
రామాంజనేయులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి కారాగార సిబ్బంది తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఖైదీ రామాంజనేయులు మృతి చెందడం జరిగిందని కారాగార సిబ్బంది తెలిపారు.ఖైదీ రామాంజనేయులు మృతి
సమాచారాన్ని అతని కుటుంబసభ్యులకు తెలిపినట్లు కడప కేంద్ర కారాగార అధికారులు మీడియాకు వెల్లడించారు.అతని జీవితంలో ఎదురైన కొన్ని చేయకూడని పనులు ఇలా చివరికి ఇనుప చువ్వవ వెనకాల మరణించే పరిస్థితికి
కారణం అయ్యాయి. Location : Andhra Pradesh First Published : May 05, 2023 8:31 AM IST Read More