Pension scheme: నెలకు రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు పెన్షన్... ఇలా పొదుపు చేస్తే చాలు

Pension scheme: నెలకు రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు పెన్షన్... ఇలా పొదుపు చేస్తే చాలు

Play all audios:

Loading...

Published by: Last Updated:July 17, 2022 5:58 PM IST PENSION SCHEME | అనేక పెన్షన్ పథకాలు అందుబాటులో ఉన్నా ఏ పెన్షన్ స్కీమ్‌లో చేరాలో తెలియక అయోమయానికి గురవుతుంటారు. కేంద్ర ప్రభుత్వానికి


చెందిన ఓ పెన్షన్ స్కీమ్‌లో (PENSION SCHEME) చేరితే 10,000 నుంచి రూ.1,00,000 వరకు పెన్షన్ పొందొచ్చు. రిటైర్మెంట్ తర్వాత లభించే పెన్షన్ వృద్ధులకు అనేక రకాలుగా ఆర్థికంగా అండగా నిలుస్తూ ఉంటుంది.


అందుకే పెన్షన్ అవసరాలను గుర్తించి ఇప్పటి నుంచే పొదుపు చేసేవాళ్లు ఉంటారు. రిటైర్మెంట్ తర్వాత ఉండే ఖర్చుల్ని అంచనా వేసి, ప్రతీ నెలా ఎంత పెన్షన్ (Monthly) కావాలో ముందుగానే లెక్కించి అందుకు


తగ్గట్టుగా పొదుపు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కేంద్ర ప్రభుత్వం అనే పెన్షన్ పథకాలను (Pension Schemes) అందిస్తోంది. అందులో నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో పొదుపు చేయడం


ద్వారా నెలకు రూ.1,00,000 వరకు పెన్షన్ పొందొచ్చు. అయితే పొదుపు చేసే మొత్తాన్ని బట్టి పెన్షన్ ఆధారపడి ఉంటుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో తక్కువ వయస్సులోనే చేరితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.


రిటైర్మెంట్‌కు చాలా సమయం ఉంటుంది కాబట్టి ముందు నుంచి చేసే పొదుపు మంచి రిటర్న్స్ ఇవ్వడంతో పాటు ఎక్కువ పెన్షన్ కూడా పొందడానికి ఉపయోగపడుతుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో మెచ్యూరిటీ తర్వాత ఒకేసారి


మొత్తం డబ్బులు తీసుకోవచ్చు. లేదా పెన్షన్ పొందొచ్చు. advertisement నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో టియర్ 1 అకౌంట్ ఎంచుకుంటే 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పొదుపు చేయాలి. సబ్‌స్క్రైబర్‌కు 60 ఏళ్ల వయస్సు


వచ్చే వరకు లాకిన్ పీరియడ్ ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో కార్పస్‌లో 60 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగతా 40 శాతాన్ని మంత్లీ పెన్షన్‌గా మార్చుకోవచ్చు. ఉదాహరణకు 25 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 35 ఏళ్ల


పాటు అంటే అతనికి 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పొదుపు చేస్తే ఎంత పెన్షన్ వస్తుందో ఈ టేబుల్‌లో తెలుసుకోవచ్చు. వార్షిక వడ్డీ రేటు 10 శాతం, యాన్యుటీ రేట్ 6 శాతంగా లెక్కిస్తే పెన్షన్ ఈవిధంగా


వస్తుంది. advertisement  ప్రతీ నెలా పొదుపు చేయాల్సిన మొత్తం  మంత్లీ పెన్షన్ అంచనా  రూ.1,307  రూ.10,007  రూ.2,613  రూ.20,007  రూ.3,950  రూ.30,243  రూ.5,230  రూ.40,044  రూ.6,540  రూ.50,074  


రూ.7,850  రూ.60,104  రూ.9,150  రూ.70,057  రూ.10,450  రూ.80,011  రూ.11,760  రూ.90,041  రూ.13,070  రూ.1,00,071 కేంద్ర ప్రభుత్వం 2004 జనవరిలో నేషనల్ పెన్షన్ స్కీమ్ ప్రారంభించింది. నేషనల్


పెన్షన్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రారంభమైన ఈ స్కీమ్ 2009లో అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చింది. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు గలవారు ఎవరైనా నేషనల్


పెన్షన్ స్కీమ్‌లో పొదుపు చేయొచ్చు. advertisement టైర్ 1 ఆప్షన్ ఎంచుకుంటే జమ చేసిన మొత్తంలో 60 శాతం విత్‌డ్రా చేయొచ్చు. ఈ మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది. మిగతా 40 శాతాన్ని యాన్యుటీగా


పొందొచ్చు. టైర్ 2 ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం నెలకు కనీసం రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. జమ చేసిన మొత్తాన్ని ఎప్పుడైనా విత్‌డ్రా చేయొచ్చు. ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవు. Location : First


Published : July 17, 2022 5:58 PM IST Read More