Play all audios:
Published by: Last Updated:June 04, 2024 7:15 AM IST TELANGANA LOK SABHA ELECTIONS RESULTS: రాష్ట్రంలోని ఏ పార్టీ ఎన్ని లోక్‌సభ సీట్లు సాధించనున్నదో మరికొన్ని గంటల్లో తేలనుంది. ఉదయం 8 గంటలకు
కౌంటింగ్ ప్రారంభం కానుంది. అయితే తొలి ఫలితం ఎక్కడ వెల్లడి కానుంది? చివరిగా ఎక్కడ ఫలితం వెల్లడికానుందంటే? 21 రోజుల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మరి
కొద్ది గంటల్లో తేలనుంది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు మే 13న పోలింగ్ జరగ్గా.. 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలైన ఓట్ల లెక్కింపు నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. దీంతో పాటుగా
సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి కూడా లోక్‌సభ ఎన్నికలతో పాటే పోలింగ్ జరిగగా.. ఆ ఓట్లు లెక్కింపు కూడా నేడే జరగనుంది.ఓట్లు లెక్కింపు కోసం అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. మరి
కొద్ది క్షణాల్లో లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. దీనికోసం కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు 34 ప్రాంతాల్లో 1,855 టేబుళ్లను
రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 275 టేబుళ్లు అందుబాటులో ఉంచారు. అయితే అధిక శాతం నియోజకవర్గాల్లో 18 నుంచి 21 రౌండ్లలో లెక్కింపు సాగనుంది. కేంద్రం
లెక్కింపు ప్రక్రియను పరిశీలించడానికి 49 మంది పరిశీలకులను నియమించింది.కౌంటింగ్ అప్డేట్స్ ఇక్కడ చూడండిరాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,32,63,384 మంది ఓటర్లు ఉండగా వారిలో 2,18,14,025 మంది ఓటర్లు తమ
ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 2.18 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలలోపు వచ్చిన ఫలితాలను బట్టి ఈ ముక్కోణపు పోరులో ప్రజలు పార్టీకి
పట్టం కట్టాలో తేటతెల్లకానుంది. సికింద్రాబాద్ ఎంపీ స్థానం ఫలితం సాయంత్ర 4 గంటలకల్లా తేలనుండగా.. హైదరాబాద్ పార్లమెంట్ విజేత ఫలితం సాయంత్ర 5:20 గంటలకు తేలనుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితం
మధ్యాహ్నం 3 గంటలకు వెలువడనుంది. ఓట్లు లెక్కింపు కోసం అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. మరి కొద్ది క్షణాల్లో లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. దీనికోసం కౌంటింగ్ కేంద్రాల వద్ద
పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు 34 ప్రాంతాల్లో 1,855 టేబుళ్లను రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 275 టేబుళ్లు
అందుబాటులో ఉంచారు. అయితే అధిక శాతం నియోజకవర్గాల్లో 18 నుంచి 21 రౌండ్లలో లెక్కింపు సాగనుంది. కేంద్రం లెక్కింపు ప్రక్రియను పరిశీలించడానికి 49 మంది పరిశీలకులను నియమించింది. advertisement
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,32,63,384 మంది ఓటర్లు ఉండగా వారిలో 2,18,14,025 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 2.18 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును
వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలలోపు వచ్చిన ఫలితాలను బట్టి ఈ ముక్కోణపు పోరులో ప్రజలు పార్టీకి పట్టం కట్టాలో తేటతెల్లకానుంది. సికింద్రాబాద్ ఎంపీ స్థానం ఫలితం సాయంత్ర 4 గంటలకల్లా
తేలనుండగా.. హైదరాబాద్ పార్లమెంట్ విజేత ఫలితం సాయంత్ర 5:20 గంటలకు తేలనుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితం మధ్యాహ్నం 3 గంటలకు వెలువడనుంది. Location : Hyderabad,Hyderabad,Telangana First
Published : June 04, 2024 7:15 AM IST Read More