Play all audios:
OLA-Rapido: అడ్వాన్స్ టిప్ వ్యవహారంలో ఓలా, ర్యాపిడోపైనా కేంద్రం విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఉబర్‌కు నోటీసులు జారీ చేసింది. OLA-Rapido | ఇంటర్నెట్ డెస్క్: క్యాబ్ సర్వీసుల అడ్వాన్స్
టిప్ వ్యవహారంపై కేంద్రం దృష్టిసారించింది. ఉబర్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా.. తాజాగా ఓలా, ర్యాపిడోపైనా విచారణ ప్రారంభించింది. ఈ రెండు సంస్థలపై సీసీపీఏ విచారణ జరుపుతోందని, అవి కూడా ఇదే
తరహా విధానాలు పాటిస్తుంటే నోటీసులు జారీ చేస్తామని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌పై ఆయన స్పందించారు. క్యాబ్/ఆటో/బైక్
సేవల కోసం బుక్ చేసుకుంటే, ‘అడ్వాన్స్ టిప్’ ఏమన్నా ఆఫర్ చేస్తారా... అప్పడు బుకింగ్ త్వరగా అయ్యే అవకాశం ఉందంటూ వినియోగదారుల మొబైల్‌కు ఉబర్ నుంచి మెసేజ్ వస్తోంది. రైడ్ బుకింగ్ సమయంలో
అడ్వాన్స్ టిప్ అంటూ రూ.50, రూ.75, రూ.100 చూపుతుంది. టిప్ అందిస్తేనే బుకింగ్ త్వరగా అవుతుందని నోట్‌లో తెలియజేస్తోంది. ఇది టిప్ ఇచ్చేందుకు యూజర్‌ను బలవంతం చేస్తోంది. ఒక్కసారి టిప్ ఇస్తే
దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేదు. ఈ అంశం సీసీపీఏ దృష్టికి రావడంతో చర్యలకు ఉపక్రమించింది. ముందుగానే టిప్ చెల్లించేందుకు సిద్ధపడమంటూ వినియోగదారులపై ఒత్తిడి వస్తోందని, ఇవి అనైతిక వ్యాపార
పద్ధతుల కిందకు వస్తాయని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.