Motorola razr 60: మోటోరొలా నుంచి మరో ఫోల్డబుల్‌ ఫోన్‌.. ధర రూ. 50వేల్లోపే

Motorola razr 60: మోటోరొలా నుంచి మరో ఫోల్డబుల్‌ ఫోన్‌.. ధర రూ. 50వేల్లోపే

Play all audios:

Loading...

Motorola Razr 60 | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ మోటోరొలా (Motorola) మరో ఫోల్డబుల్‌ ఫోన్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘రేజర్‌ 60’ (Motorola Razr 60) పేరిట 


లాంచ్‌ చేసింది. రూ.50 వేలలోపు బడ్జెట్‌లో దీన్ని తీసుకురావడం ప్రత్యేకం. మోటోరొలా రేజర్‌ 60.. 6.9 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ pOLED ఎల్‌టీపీఓ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రిఫ్రెష్‌ రేటు, 3,000


నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ కలిగిఉంటుంది. ఔటర్‌ డిస్‌ప్లే 3.63 అంగుళాల pOLED డిస్‌ప్లే ఇచ్చారు. 90Hz రిఫ్రెష్‌ రేటు, 1700 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంటుంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌


సిరామిక్‌ ప్రొటెక్షన్‌తో తీసుకొచ్చారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400X ప్రాసెసర్‌ కలిగిఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత హల్లో యూఐతో పనిచేస్తుంది.  కెమెరా ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 50 ఎంపీ


ప్రధాన కెమెరా, 13ఎంపీ అల్ట్రా వైడ్‌ షూటర్‌తో లభిస్తోంది. సెల్ఫీ కోసం ముందువైపు 32 ఎంపీ కెమెరా ఇచ్చారు. IP48 రేటింగ్‌, ఏఐ ఇమేజింగ్‌ టూల్స్‌తో దీన్ని తీసుకొచ్చారు. 4,700mAh బ్యాటరీతో


తీసుకొచ్చిన మొబైల్‌ 30W టర్బో ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. బ్లూటూత్‌ 5.4, యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. కేవలం ఒక్క వేరియంట్‌లోనే ఈ ఫోల్డబుల్‌ ఫోన్‌


లభిస్తుంది. 8జీబీ +256జీబీ వేరియంట్‌ ధర రూ.49,999గా కంపెనీ నిర్ణయించింది. జూన్‌ 4 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర రిటైల్‌ దుకాణాల్లో


కూడా కొనుగోలు చేయొచ్చు.