Reliance jio: జియోగేమ్‌ క్లౌడ్‌ యాక్సెస్‌తో 5 గేమింగ్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్లు

Reliance jio: జియోగేమ్‌ క్లౌడ్‌ యాక్సెస్‌తో 5 గేమింగ్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్లు

Play all audios:

Loading...

Reliance Jio | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో గేమింగ్‌ సెంట్రిక్‌ రీఛార్జి ప్లాన్లను కొత్తగా తీసుకొచ్చింది. ప్రీ పెయిడ్‌ సబ్‌స్క్రైబర్ల కోసం 5 కొత్త ప్లాన్లను పరిచయం


చేసింది. వీటి సాయంతో ఉచితంగా జియోగేమ్‌ క్లౌడ్‌ యాక్సెస్‌ చేయొచ్చు. JioGames Cloud అనేది రిలయన్స్‌ జియో క్లౌడ్‌ గేమింగ్‌ సర్వీస్‌. ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా గేమర్స్‌ అధిక-నాణ్యత గేమ్స్‌ను


డౌన్‌లోడ్‌ చేయకుండా నేరుగా ఆడొచ్చు. పీసీ, జియో ఎస్‌టీబీ, స్మార్ట్‌ఫోన్‌లలో ప్రీమియం గేమ్‌లు ఆడుకోవచ్చు. * ‘సిందూర్‌’ విజయం నాయకత్వ పటిమకు నిదర్శనం.. మోదీపై అంబానీ ప్రశంసలు * రూ.48 ప్లాన్‌:


10 ఎంబీ హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 3 రోజులు. మూడు రోజుల పాటూ జియోగేమ్‌ క్లౌడ్‌ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. * రూ.98 ప్లాన్‌: 10ఎంబీ హై-స్పీడ్‌


ఇంటర్నెట్‌ డేటాతో తీసుకొచ్చిన మరో ప్లాన్ ఇది. 7 రోజుల వ్యాలిడిటీ.  వారం రోజుల పాటూ జియోగేమ్‌ క్లౌడ్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. * రూ.298 ప్లాన్‌: ఎక్కువ కాలం పాటు జియోగేమ్‌


క్లౌడ్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ కావాలనుకొనే వారి కోసం ఈ ప్లాన్‌ ఉపయోగపడుఉతంది. 3జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చారు. అయితే ఇవి కేవలం గేమిండ్ యాడ్‌ ఆన్‌ ప్లాన్లు మాత్రమే. అంటే


వాయిస్‌ కాల్స్‌ లేదా ఎస్సెమ్మెస్‌ వంటి ప్రయోజనాలు ఉండవు. యాక్టివ్‌ బేస్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌తో ఈ మూడు ప్లాన్లు పనిచేస్తాయి.  * రూ.495 ప్లాన్‌: 28 రోజల వ్యాలిడితో వచ్చిన మరో ప్లాన్‌


ఇది. దీని రీఛార్జితో రోజుకు 1.5జీబీ + 5జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. 28 రోజుల పాటూ జియోగేమ్స్‌ క్లౌడ్‌ సదుపాయం, జియోహాట్‌స్టార్‌ మొబైల్‌


సబ్‌స్క్రిప్షన్‌, 28 రోజుల పాటు ఫ్యాన్‌ కోడ్‌ సబ్‌స్క్రిప్షన్‌, జియోటీవీ, జియోఏఐ క్లౌడ్‌ వంటి అదనపు ప్రయోజనాలు అందిస్తోంది. * రూ.545 ప్లాన్‌: 28 రోజుల వ్యాలిడిటీతో జియో గేమింగ్‌ ప్లాన్‌


తీసుకొచ్చారు. రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. అదనంగా 5జీబీ డేటా ఇస్తున్నారు. జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌, 28 రోజుల


ఫ్యాన్‌కోడ్‌, జియో క్లౌడ్‌, జియోటీవీ, జియో ఏఐక్లౌడ్‌ సేవలు పొందొచ్చు.