Harry haft: చావు నుంచి తప్పించుకునేందుకు బాక్సింగ్‌లో 77మందిని ఓడించాడు..

Harry haft: చావు నుంచి తప్పించుకునేందుకు బాక్సింగ్‌లో 77మందిని ఓడించాడు..

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం : ఊ.. కొట్టు వాడిని కొట్టు.. అంటూ సైనికాధికారుల అరుపులు.. బాక్సింగ్‌ రింగ్‌లో ఉన్న హాఫ్ట్‌కి ఏం తోచడం లేదు.. తన ఎదురుగా ఉన్న వారు సైతం తనలాంటి ఖైదీలే.. ఎలాంటి


నేరం చేయకపోయినా జైళ్లలో ఉంటున్నారు.. కేవలం యూదుజాతీయులైనందున వారిని జైళ్లలో పెట్టి విడతల వారీగా చంపివేస్తున్నారు.. హాఫ్ట్‌ మంచి బాక్సర్‌.. తాను ఎదుటి వాణ్ని ఓడించకపోతే జర్మన్లు తనను


చంపివేస్తారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎదుటివాణ్ణి ఓడించాడు. జర్మన్‌ అధికారుల కేరింతలు.. పరాజితున్ని తీసుకువెళ్లి కాల్చివేశారు..  77మందిని కాల్చివేశారు.. 1925లో పోలెండ్‌లో హాఫ్ట్


జన్మించారు.  ఆయన 14 ఏళ్ల వయస్సులో ఆయన దేశంపై జర్మనీ దాడిచేసింది.  నాజీల పాలనలో యూదుల ఊచకోత మొదలైంది. యూదు జాతీయుడైన హాష్ట్‌ను 1942లో నిర్బంధశిబిరానికి తరలించారు. ఇక్కడ యూదులను ప్రతిరోజూ


గ్యాస్‌ ఛాంబర్లలోకి పంపించి చంపడమే నాజీల పని. అయితే హాఫ్ట్‌ బాడీబిల్డర్‌ కావడంతో కొందరు నాజీ అధికారులు అతనికి బాక్సింగ్‌ శిక్షణ ఇప్పించారు. పోలెండ్‌లోని జవొరజ్‌నొ శిబిరంలో అతడితో ఇతర యూదు


జాతీయులతో బాక్సింగ్‌ పోటీలు పెట్టేవారు. దాదాపు 77 పోటీల్లో పాల్గొన్నాడు. ఈ పోటీలో ఓడినవారు ఏమవుతారో మీకే తెలుసు కదా. ఓడిపోతే చావే.. హాఫ్ట్‌ను బాక్సింగ్‌ రింగులోకి దింపేవారు. ఇక్కడొక నిబంధన


ఉంది. ఎవరు ఓడిపోయినా నాజీలు వారిని చంపేస్తారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో తన స్వజాతీయులనే బాక్సింగ్‌లో ఓడించేవాడు. తాను వారిని ఓడించకపోతే తన ప్రాణాలు దక్కవన్న భయం అతనిది. అలా 77 పోటీల్లో


పాల్గొని విజేతగా నిలిచాడు. విజేత అన్న పదం కన్నా చావు నుండి తప్పించుకోవడం కోసం అని చెప్పవచ్చు.  1945లో విముక్తి మిత్రదేశాలు, సోవియట్‌రష్యా సేనల రాకతో నాజీ సేనలు పరాజయం పాలైనాయి. అయితే వీరిని


తీసుకొని వేరే ప్రదేశాలకు తరలించాయి. ఈ క్రమంలో హాఫ్ట్‌ తప్పించుకున్నాడు. ఒక నాజీ సైనికుడిని చంపి ఆ దుస్తులు ధరించడంతో దారిలో తారసపడిన జర్మన్‌ సైనికులు అతన్ని అనుమానించలేదు.  అమెరికాకు


వెళ్లి.. బాక్సర్‌గా.. రెండో ప్రపంచయుద్ధం అనంతరం హాఫ్ట్‌ అమెరికాకు వెళ్లారు. అక్కడే బాక్సర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే ఎక్కువకాలం ఆ వృత్తిలో రాణించలేకపోయారు. న్యూయార్క్‌లో ఒక


దుకాణాన్ని జీవనం కోసం నడిపారు. 2007లో కన్నుమూశారు. ఈయన జీవితం ఆధారంగా హాలీవుడ్‌లో సినిమాలు వచ్చాయి.