Operation sindoor: ఏటీఎంల మూసివేత వార్తలు.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్పిందంటే..?

Operation sindoor: ఏటీఎంల మూసివేత వార్తలు.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్పిందంటే..?

Play all audios:

Loading...

Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేస్తారంటూ వాట్సప్‌లో చక్కర్లు కొడుతున్న వార్తలపై పీఐబీ స్పందించింది. ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-పాక్ ఉద్రిక్తతలు కొనసాగుతోన్న


తరుణంలో సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ముంచెత్తుతున్నాయి. కొన్ని ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించేలా ఉంటున్నాయి. ఈ యుద్ధ భయాల వేళ. ఏటీఎంలు మూసివేస్తున్నారంటూ వాట్సప్‌లో ఓ సందేశం చక్కర్లు


కొడుతోంది. ర్యాన్సమ్‌వేర్ సైబర్ దాడి జరగొచ్చని, అందుకే రెండు నుంచి మూడు రోజులు ఏటీఎంలు మూసివేస్తారని దాని సారాంశం. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్ (PIB Fact Check) చేసింది. అది ఫేక్ వార్త అని


స్పష్టం చేసింది. అవి ఎప్పటిలాగే పనిచేస్తాయని, ఇలాంటి అసత్య వార్తలను షేర్ చేయొద్దని సూచించింది (Operation Sindoor).   ఇంతకుముందు గుజరాత్‌లోని పోర్టు సహా, జలంధర్‌లో డ్రోన్‌, క్షిపణి దాడుల


దృశ్యాలంటూ సోషల్‌ మీడియాలో పాక్‌ అనుకూల వ్యక్తులు వీడియోలు షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. వీటిని భారత్‌ తిప్పికొట్టింది. పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ (PIB Fact Check) చేసి.. అవన్నీ అవాస్తవేమనని


తేల్చింది. ‘‘గుజరాత్‌లోని హజీరా పోర్ట్‌పై దాడి జరిగిందంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో అవాస్తవం. ఆ వీడియో 2021 నాటి ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ పేలుడుకు సంబంధించినదని ఫ్యాక్ట్‌చెక్‌లో


తేలింది. ఇక, జలంధర్‌లో డ్రోన్‌ దాడి అంటూ వస్తోన్న దృశ్యాలు.. ఓ అగ్ని ప్రమాదానికి సంబంధించినవి’’ అని పీఐబీ వెల్లడించింది.