Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగుతోంది: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌

Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగుతోంది: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌

Play all audios:

Loading...

దిల్లీ: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ భారత వాయుసేన కీలక ప్రకటన చేసింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor) కొనసాగుతోందని తెలిపింది. దీనిలో భాగంగా తమకు అప్పగించిన పనులను అద్భుత నైపుణ్యాలతో


అత్యంత కచ్చితత్వంతో పూర్తి చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు ‘ఎక్స్‌’లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పోస్ట్ చేసింది. ఆపరేషన్స్‌ ఇంకా కొనసాగుతున్నందున అధికారికంగా వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.


తప్పుడు సమాచారానికి దూరంగా ఉండాలని వాయుసేన కోరింది.