Play all audios:
టాలీవుడ్ హీరోల్లో ఎవరెవరితో ఎలాంటి సినిమాలు నిర్మించాలనుకుంటున్నారో నిహారిక తెలిపారు. అల్లు అర్జున్, మహేశ్‌తోపాటు ఆ జాబితాలో ఇంకెవరున్నారో చూసేయండి.. ఇంటర్నెట్ డెస్క్: అల్లు అర్జున్‌తో
ప్రేమకథా చిత్రాన్ని, మహేశ్‌బాబుతో మైథలాజికల్ మూవీని, ప్రభాస్‌తో కామెడీ ఫిల్మ్ నిర్మించాలనుందని నిహారిక (Niharika Konidela) చెప్పారు. ఒకవేళ దర్శకత్వం వహిస్తే.. తొలి సినిమా రామ్‌చరణ్‌తో
ఉంటుందన్నారు. ఓ అవార్డుల వేడుకలో.. టాలీవుడ్ హీరోల్లో ఎవరెవరితో ఎలాంటి జానర్ సినిమాలు చేయాలనుకుంటున్నారు? అని యాంకర్ ప్రశ్నించగా నిహారిక స్పందించారు. ఎక్కువ మేకప్ వేసుకోవద్దని తనలోని
యాంకర్‌కి, నిన్ను నువ్వు నమ్ముకో అని తనలోని నిర్మాతకు, మంచి స్క్రిప్టులు ఎంపిక చేసుకోమని తనలోని నటికి తానే సలహా ఇచ్చుకున్నారు. * మనుషులు పుస్తకాలై: ‘హ్యూమన్ లైబ్రరీ’పై పూరి మ్యూజింగ్స్
హోస్ట్‌గా, నటిగా తనని తాను నిరూపించుకున్న నిహారిక.. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికిగానూ ‘వర్సటైల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇది ఇయర్’ అవార్డు
అందుకున్నారు. ఇటీవల జరిగిన ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఇప్పుడు విడుదలైంది. ‘మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా ప్రస్తుతం ఓ సినిమా నిర్మిస్తున్నారు నిహారిక. మానస శర్మ దర్శకురాలు.