Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో సినిమా.. పోస్టర్‌ విడుదల

Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో సినిమా.. పోస్టర్‌ విడుదల

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆపరేషన్‌ సిందూర్’  శత్రుదేశం వెన్నులో వణుకుపుట్టిస్తోన్న పేరిది. ప్రతి భారతీయుడు సగర్వంగా చెప్పుకొంటున్న ఈ పేరుతో సినిమా రానుంది. ఏప్రిల్‌ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి


వ్యతిరేకంగా మన సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor) పేరుతో బాలీవుడ్‌లో సినిమాను తెరకెక్కించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన చేసి ఓ పవర్‌ఫుల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.


ఉత్తమ్‌ నితిన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో యూనిఫాం ధరించి.. రైఫిల్‌ పట్టుకొని నుదుటన సిందూరం


పెట్టుకుంటోన్న మహిళను చూపారు. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో ఫైటర్‌ జెట్‌లను, మండుతున్న యుద్ధ భూమిని చూపారు. ప్రస్తుతం భారత్‌ - పాక్‌ల మధ్య జరుగుతోన్న ఉద్రిక్తతలను, పహల్గాం సంఘటనను ఈ చిత్రంలో


చూపనున్నట్లు స్పష్టమవుతోంది. త్వరలోనే ఇందులో నటించనున్న నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు. * మూడు వైమానిక స్థావరాలపై భారత్‌ దాడులు: వెల్లడించిన పాక్‌ సైన్యం ఉగ్రవాద లోకానికి వణుకు


పుట్టించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindhoor) పేరుతో సినిమా తీసేందుకు సినీ దర్శక నిర్మాతలు పోటీపడ్డారు. ఈ పేరును ప్రకటించినప్పుడే సుమారు 15 నిర్మాణ సంస్థలు దీనికోసం రిజిస్టర్‌


చేసుకున్నాయి. ఇండియన్‌ మోషన్‌ పిక్చర్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌లో జీ స్టూడియోస్, టీ-సిరీస్‌ లాంటి కొన్ని బాలీవుడ్‌ బడా నిర్మాణసంస్థలు కూడా ఈ పేరు కోసం పోటీపడుతూ దరఖాస్తు చేసుకున్న విషయం


తెలిసిందే.