Anaganaga: అందరూ కచ్చితంగా చూడాల్సిన చిత్రమిది.. ‘అనగనగా’పై రఘు రామకృష్ణ రాజు ప్రశంసలు

Anaganaga: అందరూ కచ్చితంగా చూడాల్సిన చిత్రమిది.. ‘అనగనగా’పై రఘు రామకృష్ణ రాజు ప్రశంసలు

Play all audios:

Loading...

‘అనగనగా’పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు ప్రశంసలు కురిపించారు. అందరూ దీన్ని కచ్చితంగా చూడాలని కోరారు.  ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా ఇటీవల విడుదలైన ‘అనగనగా’పై


ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు (Raghurama Krishna Raju) ప్రశంసలు కురిపించారు. ఎన్నో సున్నితమైన అంశాలను హృదయానికి హత్తుకునేలా చూపించారంటూ చిత్రబృందాన్ని అభినందించారు. ‘‘తల్లిదండ్రులు,


విద్యార్థులు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది (Anaganaga). స్కూళ్లు, కాలేజీల్లో పిల్లల ఆత్మహత్యల అంశాన్ని సున్నితంగా స్పృశిస్తూ.. ఎటువంటి అసభ్య పదజాలం లేకుండా దీన్ని రూపొందించారు. కఠినంగా


ఉండేవాళ్లు కూడా ఈ సినిమా చూసి కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాంటి కథాంశంతో ప్రతిఒక్కరూ ఆలోచించే విధంగా దీన్ని తెరకెక్కించారు’’ అని ప్రశంసించారు. ఇలాంటి దర్శక నిర్మాతలను


ప్రోత్సహిస్తున్నందుకు ఈటీవీ విన్‌ను రఘు రామకృష్ణ రాజు కొనియాడారు. * సుమంత్‌ ఎమోషనల్‌ డ్రామా ‘అనగనగా’ రివ్యూ  ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే లక్ష్యంగా ఈటీవీ విన్‌ మంచి సినిమాలను అందిస్తోంది.


అందులో భాగంగానే ‘అనగనగా’ను ఇటీవల ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. విడుదలైన నాటి నుంచి ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. సుమంత్‌, కాజల్‌ చౌదరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు సన్నీ సంజయ్‌


దీన్ని తెరకెక్కించారు.