Suriya: సూర్య కొత్త చిత్రం షురూ

Suriya: సూర్య కొత్త చిత్రం షురూ

Play all audios:

Loading...

హైదరాబాద్‌: వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు హీరో సూర్య (Suriya). ప్రస్తుతం ‘రెట్రో’ (Retro) విజయాన్ని ఎంజాయ్‌ చేస్తోన్న ఆయన తాజాగా కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించారు. ‘లక్కీ


భాస్కర్‌’తో విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా


జరిగింది. ఇందులో సూర్య, వెంకీ అట్లూరి, ఇతర చిత్రబృందం పాల్గొన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు. మమితా బైజు కథానాయిక. జీవీ ప్రకాశ్‌ ఈ చిత్రానికి స్వరాలు


అందించనున్నారు. ‘సార్‌’, ‘లక్కీ భాస్కర్‌’ తర్వాత వెంకీ అట్లూరి చిత్రానికి వర్క్‌ చేయడంపై జీవీ ప్రకాశ్‌ స్పందించారు. ‘హ్యాట్రిక్‌’ కోసం వర్క్ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. సూర్య 46వ


చిత్రంగా ఇది సిద్ధం కానుంది.