Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (KL Rahul) సెంచరీతో ఆకట్టుకున్నా దిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్దేశించిన 200 లక్ష్యాన్ని గుజరాత్ ఓపెనర్లు
వికెట్ నష్టపోకుండా ఛేదించారు. అయితే.. కేఎల్ రాహుల్ ఆడిన తీరు గొప్పగా ఉందని.. అయితే అతడికి దక్కాల్సిన గుర్తింపు రాలేదని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, ఐపీఎల్ మాజీ కోచ్ టామ్ మూడీ అన్నాడు.
కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌తోనే దిల్లీ స్కోరు 200 పరుగుల వరకు చేరుకోగలిగిందని పేర్కొన్నాడు. ఇక అతడిపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నాడు. ‘కేఎల్ రాహుల్ చుట్టూ విమర్శలు ఎప్పుడూ
అసాధారణంగానే కనిపిస్తాయి. అందరూ అనుకున్నదాని కంటే అతడు గొప్ప ఆటగాడని భావిస్తాను. అతడు ఆడిన తీరు చూస్తుంటే.. అదో గొప్ప ఇన్నింగ్సే అని నేను అనుకుంటున్నాను. అయితే.. జట్టు 220 పరుగులు చేసి
ఉండాల్సింది. ఆ అవకాశం ఉన్నా చేయలేకపోయారు. క్రికెట్ అనేది వ్యక్తిగత ఆట కాదు. అందరూ సమష్టిగా రాణించాల్సి ఉంటుంది. మిడిల్ ఓవర్లలో కేఎల్ రాహుల్ కొన్ని బంతులే ఎదుర్కొన్నాడు. దీంతో కొద్దిగా
లయను కోల్పోయాడు’’ అని టామ్ మూడీ పేర్కొన్నాడు. * దెబ్బకు మూడు బెర్తులు.. ప్లేఆఫ్స్‌లో గుజరాత్, బెంగళూరు, పంజాబ్ ఇక ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు
చేశాడు. మరోవైపు గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, గిల్ చెలరేగి ఆడటంతో.. 10 వికెట్ల తేడాతో దిల్లీ ఓటమిపాలైంది.