Elon musk: ఎలాన్‌ మస్క్‌కు వీడ్కోలు పలికిన ట్రంప్‌

Elon musk: ఎలాన్‌ మస్క్‌కు వీడ్కోలు పలికిన ట్రంప్‌

Play all audios:

Loading...

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష సలహాదారుగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) వీడ్కోలు పలికారు. ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ గవర్నమెంట్‌


ఎఫిషియెన్సీ’ (DOGE) సారథిగా ఎలాన్‌ మస్క్‌ సేవలు అందించిన విషయం తెలిసిందే. మే 30న తన పదవికి చివరి రోజు కావడంతో అధ్యక్షుడు ట్రంప్‌ కార్యాలయానికి ఎలాన్‌ మస్క్‌ వెళ్లారు. ఈ సందర్భంగా మస్క్‌కు


అధ్యక్షుడు వీడ్కోలు పలికారు. డోజ్‌కు సేవలు అందించినందుకు గానూ మస్క్‌కు బంగారు రంగుతో కూడిన తాళం చెవిని అందించారు. ప్రత్యేకమైన వ్యక్తులకే ఈ బహుమతి అందిస్తానని ట్రంప్‌ తెలిపారు. ఇది దేశం తరఫున


అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో మస్క్‌ సేవలను ట్రంప్‌ అభినందించారు. తనకు అప్పగించిన బాధ్యతలను మస్క్‌ అవిశ్రాంతంగా నిర్వహించారన్నారు. ప్రపంచంలోనే మస్క్‌


ఒక గొప్ప వ్యాపారవేత్త, ఆవిష్కర్త అని కొనియాడారు. తన ప్రతిభను దేశ అభివృద్ధికి వినియోగించేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.  స్నేహితుడిగా, సలహాదారుగా ఉంటా.. డోజ్‌కు వీడ్కోలు సందర్భంగా


ఎలాన్‌ మస్క్‌ మాట్లాడారు. ఇక నుంచి తరచుగా అధ్యక్ష కార్యాలయాన్ని సందర్శిస్తానని మస్క్‌ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌ కోరితే అవసరమైన సమయంలో తన సహాయం అందిస్తానన్నారు. ఇక మీదట సైతం ట్రంప్‌నకు


స్నేహితుడిగా, సలహాదారుగా ఉంటానని పేర్కొన్నారు. ‘డోజ్‌’ పదవి కాలం పరిమితితో కూడుకున్నదని మస్క్‌ తెలిపారు. ఇప్పటినుంచి తన వ్యాపారాలపై మరింత దృష్టి సారిస్తానన్నారు. ‘డోజ్‌’కు ఇది ముగింపు కాదని,


ప్రాజెక్ట్‌ ఇప్పుడే ప్రారంభమైందన్నారు. ట్రిలియన్‌ డాలర్ల వృథాను ఇది అరికడుతుందన్నారు.  ట్రంప్‌ రెండోసారి అమెరికా ప్రభుత్వ పగ్గాలు చేపట్టడంతో టెస్లా సీఈవో, బిలియనీర్‌ అయిన ఎలాన్‌ మస్క్‌ను తన


పాలకవర్గంలోకి సలహాదారుగా తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వంలో పెద్దఎత్తున వృథా ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా ‘డోజ్‌’ శాఖను ఏర్పాటు చేసి మస్క్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. దీంతో ప్రభుత్వంలో


సమూల మార్పుల దిశగా మస్క్‌ అనేక ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు సూచనలు చేశారు. ప్రభుత్వంలో ఆయన జోక్యం పెరుగుతోందంటూ విపరీతమైన విమర్శలు వచ్చాయి.  అయితే ట్రంప్‌ ఇటీవల తీసుకొచ్చిన ‘‘వన్‌ బిగ్‌


బ్యూటిఫుల్‌ బిల్‌ యాక్ట్‌’’కు నిరసనగానే మస్క్‌ తన పదవి నుంచి వైదొలగారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ బిల్లు ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచుతుందని, వ్యయ నియంత్రణ కోసం ‘డోజ్‌’ చేసిన పనిని


నిర్వీర్యం చేస్తుందని మస్క్‌ గతంలో పేర్కొన్నారు. మరోవైపు కృత్రిమ మేధ సంస్థ ఓపెన్‌ఏఐకి, యూఏఈకి మధ్య ఒప్పందం వద్దని మస్క్‌ అమెరికా అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చినట్లు ఇటీవల వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌


కథనం పేర్కొంది. మస్క్‌ అభ్యర్థనను ట్రంప్‌ పట్టించుకోలేదని, ఇది కూడా మస్క్‌ రాజీనామాకు ఓ కారణమై ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. అయితే అమెరికా చట్టాల ప్రకారం ఏ వ్యక్తికీ వరుసగా 130 రోజులకు


మించి ఈ హోదాను ఇవ్వకూడదు. దీని ప్రకారం మే 30తో మస్క్‌ గడువు పూర్తయింది.