Donald trump: హార్వర్డ్‌పై పోరాటంలో విజయం సాధిస్తా: ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Donald trump: హార్వర్డ్‌పై పోరాటంలో విజయం సాధిస్తా: ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Play all audios:

Loading...

హార్వర్డ్‌ యూనివర్సిటీకి అందాల్సిన 3 బిలియన్‌ డాలర్లను.. ట్రేడ్‌ స్కూల్స్‌కు బదిలీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఇంటర్నెట్‌డెస్క్‌:


హార్వర్డ్‌ యూనివర్సిటీకి (Harward University), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగానికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఆ విశ్వవిద్యాలయానికి అందాల్సిన 3 బిలియన్‌ డాలర్లను దక్కకుండా


చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్‌ (Donald Trump) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు.  ‘‘హార్వర్డ్‌కు 3 బిలియన్‌ డాలర్లను దక్కకుండా చేసే అంశాన్ని


పరిశీలిస్తున్నా. ఆ మొత్తాన్ని దేశంలోని ట్రేడ్‌ స్కూల్స్‌కు బదిలీ చేయాలని భావిస్తున్నా. అమెరికాకు ఇది గొప్ప పెట్టుబడి అవుతుంది. విదేశీ విద్యార్థులకు సంబంధించిన జాబితాను యూనివర్సిటీ ఇంకా


అందించలేదు. దాని కోసం ఎదురుచూస్తున్నా. దేశానికి ముప్పు రాకుండా ఉండటం కోసం బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశాం. ఆ తర్వాత కూడా ఉన్మాదులు, అమెరికాను ఇబ్బందులు పెట్టాలనుకునే వారు ఇంకా ఉన్నారా? అని


తెలుసుకోవడం కోసం ఈ జాబితా ఉపయోగపడుతుంది. అప్పుడే అలాంటివారిని దేశంలోకి మళ్లీ రాకుండా నియంత్రించగలం. హార్వర్డ్‌పై మా ప్రభుత్వం విజయం సాధిస్తుంది’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. * పుతిన్‌ ప్రవర్తన


మరీ మూర్ఖంగా ఉంది ఇటీవల హార్వర్డ్‌ యూనివర్సిటీకి అందించే నిధుల్లో ట్రంప్ కోత విధించిన సంగతి తేలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేశారు.


దీన్ని వ్యతిరేకిస్తూ ఈ విశ్వవిద్యాలయంం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ట్రంప్‌ చర్య అనైతికమని, నిబంధనలు ఉల్లంఘించడం అవుతుందని హార్వర్డ్‌ ఆరోపించింది. ‘‘ఒక్క సంతకంతో యూనివర్సిటీలోని మొత్తం


విద్యార్థుల్లో పావువంతు మందిని తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’ అని వెల్లడించింది. దీనిపై విచారణ జరిపిన ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి.. ట్రంప్‌ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు


జారీ చేశారు. కాగా.. యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నామని ట్రంప్‌ ఆదివారం తెలిపారు. ఆయా దేశాలు వారి విద్యార్థుల చదువు కోసం ఎలాంటి సొమ్ము చెల్లించడంలేదని


వ్యాఖ్యానించారు.