Pendulum review: రివ్యూ: పెండ్యులం.. మలయాళ మిస్టరీ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

Pendulum review: రివ్యూ: పెండ్యులం.. మలయాళ మిస్టరీ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

Play all audios:

Loading...

లూసిడ్‌ డ్రీమింగ్‌ కాన్సెప్టుతో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ ‘పెండ్యులం’ (Pendulum). విజయ్‌ బాబు (Vijay Babu), అనుమోల్‌ (Anumol), ప్రకాశ్‌ బారె ప్రధాన పాత్రధారులు. రెజిన్‌ ఎస్‌.బాబు


దర్శకత్వం వహించిన ఈ మలయాళ మూవీ ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో గురువారం నుంచి తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి, ఈ సినిమా థ్రిల్‌ చేసిందా? లూసిడ్‌ డ్రీమింగ్‌ ఏంటి? కేరళకు చెందిన డాక్టర్‌


మహేశ్‌ నారాయణన్‌.. భార్య, కుమార్తెతో కలిసి ఓ రోజు విహారయాత్రకు వెళతాడు. మార్గమధ్యలో ఓ ప్రాంతం నచ్చడంతో వారు అక్కడే కాలక్షేపం చేయాలనుకుంటారు. ఆ క్రమంలో.. మహేశ్‌కు గత జ్ఞాపకాలు గుర్తొస్తాయి.


మరోవైపు తన కుమార్తె చేసిన పొరపాటు కారణంగా కారు పూర్తిగా లాక్‌ అయిపోతుంది. దాంతో సమీపంలోని ఓ ఇంట్లో ఆ రాత్రి ఆశ్రయం పొందుతారు. ఉదయం మహేశ్‌ కనపడకపోవడంతో అతడి భార్య కంగారు పడుతుంది. ఆ ఇంటి


వారితో కలిసి వెతగ్గా.. వేరే చోట స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు మహేశ్‌. తేరుకున్నాక.. తనను లారీ ఢీ కొట్టిందని చెబుతాడు. ఆ ప్రమాదం నిజంగా జరిగిందా? కల కన్నాడా? ఆ ప్రాంతంతో తనకున్న సంబంధమేంటి? తన


సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో మహేశ్‌ తెలుసుకున్న నిజాలేంటి? అతడి కలలోకి వచ్చే ఆమిర్‌- ఏంజెల్‌ ఎవరు? అన్నది ఈ కథలో కీలకం (Pendulum Story). మనం నిద్రలోకి జారగానే అప్పుడప్పుడు కలలు రావడం


సాధారణం. కానీ, అది కల అని కలలో మనం గుర్తించలేం. ఇతరుల కలలోకి మనం వెళ్లలేం. కావాల్సిన వారిని మన కలలోకి తీసుకురాలేం. ఇతరులు ఎలాంటి డ్రీమ్స్‌లో ఉన్నారో చెప్పలేం. ఇలాంటి అరుదైన కలలు కనడమే


‘లూసిడ్‌ డ్రీమింగ్‌’. అంటే నిజ జీవితంలో మనకు నచ్చినట్లుగా ఉండక పోవచ్చు గానీ కలలో ఉండొచ్చు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ సినిమా ఓ ప్రయోగంలాంటిదే. టిపికల్‌ కాన్సెప్టులను ఎంపిక చేసుకోవడం ఒకెత్తైతే


దాన్ని అర్థవంతంగా తెరపైకి తీసుకురావడం మరో ఎత్తు. తొలి ప్రయత్నంలోనే దర్శకుడు రెజిన్‌ ఈ సబ్జెక్టు ఎంచుకోవడం అభినందనీయం. ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, మంచి అనుభూతి పంచాలన్న అతడి


‘కల’ దాదాపు నెరవేరింది (Pendulum Review). కలల ఇతివృత్తంగా సాగే కథ ఇది అని ప్రారంభ సన్నివేశంతోనే అర్థమవుతుంది. కలలకు ఉన్న శక్తి గురించి ఆమిర్‌ తండ్రి వివరించడం, తాను ఇష్టపడిన ఏంజెల్‌తో ఆమిర్‌


వాటిని పంచుకోవడం వంటి అంశాలు ప్రేక్షకుడిని మెల్లిగా ‘పెండ్యులం’ ప్రపంచంలోకి తీసుకెళతాయి. అలా ఆ వరల్డ్‌లోకి వెళ్లిన ప్రేక్షకుడిని డాక్టర్‌ మహేశ్‌ పాత్ర కట్టిపడేస్తుంది. మహేశ్‌ కుటుంబ


నేపథ్యంలో సాగే సీన్స్‌ రొటీన్‌గా ఉన్నా.. తన సమస్యకు పరిష్కారం కోసం మహేశ్‌ చేసే ప్రయాణం ఉత్కంఠభరితం. మహేశ్‌ జర్నీలో భాగంగా ఆమిర్‌- ఏంజెల్ స్టోరీ మరోసారి తెరపైకి వస్తుంది. ఎప్పుడో జరిగిన


దాన్ని ప్రస్తుత కథకు ముడిపెట్టిన విధానం కన్‌ఫ్ల్యూజ్‌ క్రియేట్‌ చేస్తుంది. ఏది కలో? ఏది నిజమో? అన్నది అర్థచేసుకోవడం కష్టం. ప్రీ క్లైమాక్స్‌లోనూ అదే పరిస్థితి. అలాగని ఆసక్తికరంగా లేదని


చెప్పడానికి లేదు. పలు కీలక సన్నివేశాల్లో నత్తను హైలైట్‌ చేస్తూ ‘దాని వల్ల ఏదో జరగబోతోంది’ అన్న ఉత్కంఠ రేకెత్తించిన దర్శకుడు దానికి సరైన ముగింపు ఇవ్వకపోవడం ప్రేక్షకుడికి అసంతృప్తే. తెరపై


కనిపించిన ప్రతి పాత్ర ఆకట్టుకుంటుంది. వైద్యుడిగా, మరోవైపు మానసిక సమస్య ఎదుర్కొంటున్న వ్యక్తిగా విజయ్‌ బాబు సహజంగా నటించారు. ఏంజెల్‌గా అనుమోల్‌ అందం, అభినయంతో మెప్పిస్తారు.  * కుటుంబంతో కలిసి


చూడొచ్చా?: ఫ్యామిలీతో కలిసి నిరంభ్యంతరంగా చూడొచ్చు. ఇందులో అసభ్యకర సన్నివేశాలు, సంభాషణల్లేవు. నిడివి: దాదాపు 1:40 గంటలు. * చివరిగా: ‘పెండ్యులం’.. ప్రయోగం.. ఆసక్తికరం (Pendulum Review)! *


గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!