Zelenskyy: యుద్ధం ముగింపునకు రష్యా సిద్ధంగా లేదు.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

Zelenskyy: యుద్ధం ముగింపునకు రష్యా సిద్ధంగా లేదు.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

Play all audios:

Loading...

ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఇంటర్నెట్‌డెస్క్‌: యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే రష్యా


అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) పేర్కొన్నారు. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలకు మద్దతిస్తున్న అమెరికా అధ్యక్షుడు


డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఇరుదేశాల అధ్యక్షులతో ఫోన్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్‌ కాల్‌ అనంతరం జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.  ‘రష్యాకు ఉన్న నియమాలు ఏంటనేవి నాకు తెలియదు. ఈ


యుద్ధంలో మేము చాలా కోల్పోయాం. దీన్ని ముగించడం మాకు చాలా ముఖ్యం. అందుకు మేము సిద్ధం. కానీ, రష్యా (Russia) అందుకు సుముఖంగా ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. మేము వారిని నమ్మం. ముందుగా కాల్పుల


విరమణకు వారు అంగీకరించాలి. ఆ తర్వాత యుద్ధాన్ని పూర్తిగా ఆపేయాలి. ఇదే మేం కోరుతున్నాం. ఎలాంటి  షరతులు లేకుండా ఈ కాల్పుల విరమణను ప్రతిపాదించినందుకు ట్రంప్‌నకు కృతజ్ఞతలు’ అని జెలెన్‌స్కీ


పేర్కొన్నారు. రష్యా ఈ హత్యలు ఆపేందుకు సిద్ధంగా లేకుంటే.. దానిపై ఆంక్షలు విధించాలని ఈ సందర్భంగా జెలెన్‌స్కీ డిమాండ్‌ చేశారు. మాస్కోపై ఒత్తిడి తీసుకొచ్చి కీవ్‌లో శాంతి నెలకొల్పాలన్నారు. *


ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు సిద్ధం: ఫోన్‌లో మాట్లాడుకున్న ట్రంప్‌, పుతిన్‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ట్రంప్‌ దాదాపు 2 గంటల పైనే ఫోన్‌లో మాట్లాడుకున్నారు. దీని అనంతరం


ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపునకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్‌ తెలిపారు. ఉక్రెయిన్‌తో కలిసి శాంతి స్థాపనకు అంగీకరించిన ఆయన.. అందుకు పలు నియమాలు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య


చర్చలు సరైన దిశలోనే సాగుతున్నట్లు పుతిన్‌ తెలిపారు. శాంతిస్థాపన అనేది సంఘర్షణలకు మూల కారణాలను పరిష్కరించడంపై ఆధారపడి ఉంటుందన్న ఆయన.. అందుకు ఉత్తమమైన మార్గాలను వెతకడం ప్రస్తుతం ముఖ్యమన్నారు. 


ఇక, ఈ ఫోన్‌ కాల్‌ అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ. ఇరుదేశాలు తక్షణమే కాల్పుల విరమణ చర్చలు ప్రారంభిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. రష్యా అధ్యక్షుడితో ఫోన్‌ కాల్‌ అద్భుతంగా సాగినట్లు తెలిపారు.