Jee advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. ఇలా చేస్తే సులభంగా దరఖాస్తు చేయొచ్చు!

Jee advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. ఇలా చేస్తే సులభంగా దరఖాస్తు చేయొచ్చు!

Play all audios:

Loading...

జేఈఈ అడ్వాన్స్‌డ్-2022: అవసరమయ్యే డాక్యుమెంట్లు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసే సమయంలో ప్రధానంగా ఈ సర్టిఫికెట్లు అవసరమవుతాయి. - 12వ తరగతి లేదా అందుకు సమానమైన పరీక్ష సర్టిఫికెట్లు -


కేటగిరి, పీడబ్ల్యూడీ లేదా డీఎస్ సర్టిఫికేట్ (వర్తిస్తే) - స్క్రైబ్ లెటర్ (వర్తిస్తే) - పీఐఓ కార్డ్ లేదా ఓసీఐ సర్టిఫికేట్(అవసరమైతే). జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 దరఖాస్తు విధానం advertisement


స్టెప్-1: అధికారిక వెబ్‌సైట్ JEEADV.AC.INను సందర్శించాలి స్టెప్-2: జేఈఈ మెయిన్ -2022 అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ వంటి లాగిన్ వివరాలను నమోదు చేయాలి. స్టెప్-3: ప్రాథమిక వివరాలతో


రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయండి. స్టెప్-4: స్పెసిఫికేషన్స్ ప్రకారం అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి స్టెప్-5: అప్లికేషన్ ఫీజును చెల్లించండి స్టెప్-6: వివరాలను ప్రివ్యూ చూసిన


తరువాత అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయండి జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 కోసం మహిళా అభ్యర్థులు రూ.1400, ఎస్సీ, ఎస్టీ, పీడబ్లూడీ అభ్యర్థులతో పాటు ఇతరులు రూ.2,800 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. JEE


అడ్వాన్స్‌డ్-2022 పరీక్ష ఆగస్టు 28న జరగనుంది. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం


5:30 గంటల వరకు జరగనుంది. అభ్యర్థులు రెండు పేపర్లకు తప్పనిసరిగా హాజరు కావాలి. advertisement జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT). రెండు లాంగ్వేజ్‌‌లైన హిందీ(Hindi), ఇంగ్లిష్‌లో


మొత్తంగా ఆరు గంటల పాటు పరీక్ష జరుగుతుంది. ప్రతి ఏడాది మార్కింగ్ స్కీమ్ మారుతూ ఉంటుంది. తప్పు సమాధానాలకు నెగటివ్ మార్క్స్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇది కొన్ని ప్రశ్నలకు మాత్రమే ఉండవచ్చు.


మార్కింగ్ స్కీమ్ వివరాలు ‘ఇన్‌స్ట్రక్షన్ టూ క్యాండిడేట్స్’ సెక్షన్‌లో పరీక్ష సమయంలో అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి పేపర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనే మూడు భాగాలు ఉంటాయి.


advertisement Location : Hyderabad,Telangana First Published : August 08, 2022 1:56 PM IST