Flipkart axis credit card: ఫ్లిప్‌కార్ట్‌-యాక్సిస్‌ కార్డు యూజర్లకు షాక్‌.. లాంజ్‌ యాక్సెస్‌ తొలగింపు

Flipkart axis credit card: ఫ్లిప్‌కార్ట్‌-యాక్సిస్‌ కార్డు యూజర్లకు షాక్‌.. లాంజ్‌ యాక్సెస్‌ తొలగింపు

Play all audios:

Loading...

Flipkart Axis Credit Card: ఫ్లిప్‌కార్ట్-యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు యూజర్లకు షాక్‌. ఈ కార్డుపై ఇక లాంజ్‌ యాక్సెస్‌ ప్రయోజనాలు లభించవు. Flipkart Axis Credit Card | ఇంటర్నెట్‌


డెస్క్‌: ఫ్లిప్‌కార్ట్‌-యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డు వినియోగదారులకు అలర్ట్‌. ఈ కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డుపై అందిస్తున్న లాంజ్‌ యాక్సెస్‌ సదుపాయాన్ని యాక్సిస్‌ బ్యాంక్‌ తొలగించింది. 2025


జూన్‌ 20 నుంచి ఈ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు వినియోగదారులకు సమాచారం ఇస్తోంది. అదే సమయంలో మింత్రాపై ఇస్తున్న క్యాష్‌బ్యాక్‌ను పెంచింది. గతంలో మింత్రాలో కొనుగోళ్లపై 1 శాతంగా ఉన్న


క్యాష్‌బ్యాక్‌ను 7.5 శాతానికి పెంచింది. స్టేట్‌మెంట్‌ త్రైమాసికంలో గరిష్ఠ పరిమితిని రూ.4000గా నిర్ణయించింది.  ఈ కార్డు ఇతర ప్రయోజనాల విషయానికొస్తే.. ఫ్లిప్‌కార్ట్‌, క్లియర్‌ట్రిప్‌పై


కొనుగోళ్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఒక త్రైమాసికంలో వీటిపైనా గరిష్ఠంగా రూ.4 వేల క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనుంది. వీటితో పాటు స్విగ్గీ, పీవీఆర్‌, కల్ట్‌ఫిట్‌, ఉబర్‌ లావాదేవీలపై 4 శాతం


క్యాష్‌బ్యాక్‌ బ్యాక్‌ లభిస్తోంది. ఇతర కొనుగోళ్లపై 1 శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. ఈజీడైనర్‌పై 15 శాతం వరకు (రూ.100) క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. రూ.400పైబడి చేసే చమురు కొనుగోళ్లపై 1 శాతం


ఫ్యూయల్‌ సర్‌ఛార్జి రద్దు వర్తిస్తుంది.  * ప్రైమ్‌ వీడియోలో ఇక యాడ్స్‌.. వద్దనుకుంటే అదనంగా చెల్లించాల్సిందే! కో-బ్రాండ్‌ క్రెడిట్‌ కార్డుల్లో అమెజాన్‌-ఐసీఐసీఐ, ఫ్లిప్‌కార్ట్- యాక్సిస్‌


బ్యాంక్‌ కార్డులు చాలా పాపులర్‌. ఆయా ఇ-కామర్స్‌లో ఎక్కువగా షాపింగ్‌ చేసే వాళ్లు వీటిని ఎంచుకుంటూ ఉంటారు. అమెజాన్‌- ఐసీఐసీఐ కార్డుకు ఎలాంటి జాయినింగ్ ఫీజు లేదు. ఫ్లిప్‌కార్ట్‌-యాక్సిస్‌


కార్డుకు తీసుకోవాలంటే రూ.500 ప్రవేశ రుసుము చెల్లించాలి. రెండో ఏడాది నుంచి రూ.500 చొప్పున రెన్యువల్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదిలో రూ.3.50 లక్షలు పైబడి కొనుగోళ్లు జరిపితే రెన్యువల్‌


ఫీజును రద్దు చేస్తారు.