Ipl 2025: ప్లేఆఫ్స్‌ పోరు ముందు ఆర్సీబీకి ఓ శుభవార్త

Ipl 2025: ప్లేఆఫ్స్‌ పోరు ముందు ఆర్సీబీకి ఓ శుభవార్త

Play all audios:

Loading...

ఆర్సీబీ ఆటగాడు జాకబ్‌ బెతెల్‌ ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌నకు అందుబాటులో ఉండటం లేదు. అతడి స్థానంలో న్యూజిలాండ్‌ ఆటగాడైన టిమ్‌ సీఫెర్డ్‌ బెంగళూరు జట్టులో చేరనున్నాడు.  ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత


ఐపీఎల్‌ (IPL) సీజన్‌లో ఆర్సీబీ (Royal Challengers Bengaluru) ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. 12 మ్యాచుల్లో ఎనిమిదింట్లో విజయం సాధించింది. 17 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో


కొనసాగుతోంది. ఇలాంటి కీలక సమయంలో ఆర్సీబీ జట్టులో ఓ మార్పు జరగనుంది. భారత్‌, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ ఓ వారంపాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. పునఃప్రారంభమైన తర్వాత


షెడ్యూల్లో మార్పుల కారణంగా ఇంగ్లండ్‌ ఆటగాడైన జాకబ్‌ బెతెల్‌.. ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ ఆడటం లేదు. మే 29 నుంచి ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మధ్య వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జాకబ్‌


బెతెల్‌ ఆర్సీబీకి అందుబాటులో ఉండటం లేదు. ఇతడి స్థానంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులోకి న్యూజిలాండ్‌ ఆటగాడైన టిమ్‌ సీఫెర్డ్‌ రానున్నాడు. ఇందుకుగాను బెంగళూరు యాజమాన్యం ఇతడికి రూ.రెండు


కోట్లు చెల్లించనుంది. ఈ మేరకు సీఫెర్డ్‌తో ఆర్సీబీకి గురువారం ఒప్పందం కుదిరింది. ఇది మే 24 నుంచి అమల్లోకి రానుంది. ఈ శుభవార్తతో ఆర్సీబీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే


ప్లేఆఫ్స్‌నకు చేరుకున్న ఆర్సీబీ మే 23న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో (Sunrisers Hyderabad) లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. జాకబ్‌ బెతెల్‌కు ఈ సీజన్‌లో ఇదే చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ కానుంది. అనంతరం అతడు మే


24న స్వదేశం చేరుకుని, ఇంగ్లండ్‌ జట్టుతో కలవనున్నాడు. మే27న ఆర్సీబీ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ను లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో (Lucknow Super Giants) ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టిమ్‌ సీఫెర్డ్‌ పాల్గొనే


అవకాశం ఉంది. ఇప్పటి వరకు 66 టీ20లు ఆడిన సీఫెర్డ్‌ 1,540 పరుగులు చేశాడు. గతంలో 2022 సీజన్‌లో ఈ న్యూజిలాండ్‌ ఆటగాడు మూడు ఐపీఎల్‌ మ్యాచ్‌లు కూడా ఆడాడు.  మరోవైపు గుజరాత్‌ టైటాన్స్‌కు (Gujarat


Titans) ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఇంగ్లండ్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ (jos buttler) కూడా ప్లే ఆఫ్స్‌నకు అందుబాటులో ఉండటం లేదు. ఇంగ్లండ్‌, వెస్ట్‌ఇండీస్‌ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు


జరగనుండటమే దీనికి కారణం.