Play all audios:
విరాట్‌కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్ క్రికెట్ దాగిఉందని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సయ్యద్ కిర్మాణి అభిప్రాయపడ్డాడు ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా (Team
India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్ట్ క్రికెట్ నుంచి తాను రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు సోమవారం ప్రకటించాడు. కోహ్లీ ఇప్పటివరకు భారత్ తరఫున 123 టెస్టులు ఆడాడు. 46.85
సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. భారత్ టీ20 వరల్డ్‌కప్ (ICC Mens T20 World Cup) గెలిచిన తర్వాత టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లీ.. తాజాగా రెడ్‌బాల్ క్రికెట్ నుంచీ
తప్పుకున్నాడు. ఈనేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టులోని సభ్యుడైన సయ్యద్ కిర్మాణి స్పందించాడు. ‘విరాట్ ఆటలో స్థిరత్వాన్ని ప్రదర్శించాడు. అదే అతణ్ని
ప్రత్యేకంగా నిలిపింది. కోహ్లీ యువతకు ప్రేరణగా నిలిచాడు. నాకు తెలిసి అతడు వ్యక్తిగత రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోడు. అలాగే అతడు వీడ్కోలు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఎలాంటి ఒత్తిడికీ
గురై ఉండడు. రిటైర్‌మెంట్ అనేది అతడి వ్యక్తిగత నిర్ణయం. ప్రతి క్రికెటరూ ఏదోఒకరోజు రిటైర్ కావాల్సిందే. కానీ విరాట్‌కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్ క్రికెట్
దాగిఉంది. ఏది ఏమైనప్పటికీ నేను అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. అతడి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా’ అని సయ్యద్ కిర్మాణి అన్నాడు. అలాగే ఈ మధ్య క్రికెటర్లు తమ రిటైర్‌మెంట్ ప్రకటనలను
సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. దీనిమీద కూడా కిర్మాణి స్పందించాడు. ‘క్రికెటర్లు ఇలా సోషల్ మీడియాలో తమ రిటైర్‌మెంట్‌కు సంబంధించిన ప్రకటనలు చేయడంలో ఏవిధమైన తప్పూ లేదు. ఇన్‌స్టాగ్రాం లాంటి
వేదికల వల్ల ప్రపంచవ్యాప్తంగా విషయం తెలుస్తుంది’ అని తన అభిప్రాయం వ్యక్తంచేశాడు.